హృదయమొక రహస్య పాటల భోషాణం

వొకే పాట యే జ్ఞాపకాలను చిలకరిస్తుందో, యే అనుభవాలను గుమ్మరిస్తుందో ఆ అనుభవాలు యెవరికి వారికే సొంతం. పాటలు మన లోపలి పొరల్లో మౌనవ్రతం చేస్తుంటాయి. సాయంకాలపు సంపెంగ పరిమళంలా సమయం వచ్చినప్పుడు చకచకా మేం వున్నామని వచ్చేస్తాయి. పాట యెవరినైనా యిట్టే లాక్కుంటుంది. పెద్దగా శ్రమ పడకుండా, హోం వర్క్ చెయ్యకుండా కేవలం వినగలిగే నర్వ్ కాస్త యెలర్ట్ గా వుంటే చాలు పాట యెవరిలోకైనా దూరిపోయి దాక్కోగలదు. భాష అర్ధం కాక పోయినా, ఆ …

స్వప్న సాకారపు అడుగులు వేద్దాం సాహసీ…

వొకానొక కార్తీక ప్రభాతాన యేవో యేవో ఆలోచనలతో వూహలతో నడుస్తోంటే శీతాకాలపు లేత సూర్యరశ్మిలా నా అరిచేతుల్లోకి వచ్చేసినవారు దొస్తోయేవ్ స్కీ. దొస్తోయేవ్ స్కీ... మీకు తెలుసా... పేద ప్రజల అణిచివేత, నిజాయితీపరులైన పేదల జీవితాల్లోని విషాదం మీకు మీ వయస్సుకు మించిన చూపు కలిగినట్టే. పేదల ఆకలి, పేదరికం, వివక్ష, దోపిడీ అత్యంత పసివయస్సులోనే తన మనసుకి తాకిన సున్నిత మనస్కుడైన నా ప్రియ స్నేహితుడికి కలిగింది. నా స్నేహాన్ని చూసినప్పుడంతా మీరే గుర్తు వస్తారు. …