రాత్రి కురిసిన నగరపు వాన…

కిటికీ అద్దాల మీద రిఫ్లెక్ట్ అవుతున్న నీరెండ. కారిడార్ ల్లో వో మూలకి పెట్టిన మనీప్లాంట్ తీగ పక్కకి వొరిగి అప్పుడప్పుడూ బయట గాలికి వూగుతుంది. రాత్రి వానకి తడిసిపోయిన కాంక్రీట్ గోడలు. చెమ్మకి పెచ్చులూడిపోయిన పిస్తాగ్రీన్ గోడలు. లిఫ్ట్ నిండా, మెట్లంతా చేరిన రాత్రి వాన తాలూక నీరు యింకా అప్పుడప్పుడూ కిందకి జారుతోంది. అపార్ట్ మెంట్ ఆఫీషియల్ వాట్స్అప్ గ్రూప్ లో మేస్సేజస్ వస్తున్నాయి ఆ యా ఫ్లాట్స్ వాళ్ళ నుంచి. వై ఫై …

నైరుతి ఆగమ వేళ

నైరుతి ఆగమ వేళ నిలువెత్తు పొదలా సరుగుడు చెట్ల గాలులు తీరం వైపుకు తోస్తున్నప్పుడు యెదురుగా నీలివెన్నెలాకాశంలా  సాగరం దివారాత్రులు యెగిసి పడే కెరటాలు అలలై  వుత్త హోరుని వినిపిస్తూ తీరభూమికి యేమి చెప్పాలనుకుంటున్నాయి! అసలైన మాట ముత్యమై యే చేతి వేలిని  ప్రపోజ్ చెయ్యాలనుకుంటుందోనన్న వైనాన్ని అత్యంత రహస్యంగా తన లోలోపల దాచుకున్నది యెందుకో! ఆ లోతుని చేధించే మంత్రాన్ని  యే యేడేడు సంద్రాల అవతల   యే చెట్టు తొర్రలో దాచి పెట్టిందో యీ అగాధనీలిమ …

లోవెలుగు…

లోవెలుగు చినుకుల్లో మొలకల పరిమళపు వెలుతురు చిట్టిపొట్టి జల్లులలో తడిచిన మనసుల సౌరభం వొక్క చినుకు చాలు వొంటిపై యింద్రధనస్సు విరబూయటానికి…!

రెడ్ బ్యాంగిల్స్

శ్రావ్య సుప్రభాతం. నిన్నా మొన్నా అటు మొన్నా యిలా రోజులు గడిచిపోతుంటాయి యెప్పటిలానే మనిద్దరం వొకరి కళ్ళల్లోకి వొకరు చూసుకోకుండా... కలిసి కూర్చుని Marquez నో..  బిభూధినో మళ్ళీ మళ్ళీ పలవరిస్తుంటాం చూడు... అలా కలబోతల పలవరింత లేకుండానే వుదయాలు గడుస్తున్నాయి. వుదయమే రంగురంగుల కవిత్వపుపూలతోటల నుంచి నువ్వు  యెంచిన  వొక కవితని... నే నిద్రలోంచి కనురెప్పలు విప్పేసరికి నా కళ్ళ ముందు వుంచుతావు చూడు...  ప్రభాతాన్నే వో రమ్య భావనని చూడటం  మృదువుగా మన దినచర్య …

నలభై ఒకటవవాడు…

నీకిష్టం కదా యీ కేక... 'వాడి దూము తగల నీలికళ్ల దయ్యం: అలాఅలా నోట్ బుక్ లో రాసేస్తూ.. రాసేస్తూ.. నీ చిన్ని నవ్వు..  యెన్ని సార్లు చదువుకున్నా.. మళ్ళీ మళ్ళీ నీకిష్టమైన ఆ పిలుపు దగ్గరే... చెవొగ్గి... . చైత్ర మాసాన విన్న కోకిల పాటలా ... కొన్ని అనుభూతులు యెప్పుడు వాడిపోవు. మరుపు పొరల్లో కనుమరుగై పోవు. యే పుస్తకం గురించి రాక్ లో చూస్తున్నా ముందు చేతిలో కి వచ్చే పుస్తకం - …

‘జీవితాదర్శం’ – శాంతి

రెడ్ బ్యాంగిల్స్ "మొదటినించీ లాలస ప్రత్యేకమైన స్త్రీ అని తెలుసు.ఆమెని చూస్తుంటేనే జీవితం యెంత లోతో, యెంత అందమో, చాలా నేర్చుకుంటాము. ఆమె ఈ మాల్వoకర్ పాల యెట్లా పడ్డదా అని నా ఆశ్చర్యం. కల్పించుకొని ఆమెని మాల్వాoకర్ దగ్గర నుంచి వెళ్లిపోమన్నాను. కానీ వెళ్లనంది. గొప్ప వ్యక్తులoదరిలో వుండే గుణాలు కష్టాలలలో సహనం, తను ప్రేమిoచే మనిషి స్వర్గానికి మారతాడనే ఎడ తెగని విశ్వాసం, తాను మార్చ గలననే ధైర్యం అమరిమితం ఆమెలో. జీవితాన్ని ఎక్కువగా …

రెడ్ బ్యాంగిల్స్

నూట మూడు వసంతాల వెలుగునీడలు: ..... మే 2 వ తేదీన జన్మించిన మృదువైన మాంత్రిక హృదయం సత్యజిత్ రే గారికి వినమ్ర నమస్సులు. మొగలిపూరేకుల నడుమ సహజసిద్ధమైన పరిమళం దాక్కుని మనం పలకరించగానే  విరజిమ్మే సుగంధాన్ని స్పర్శించాలని మనసేలా ఆరాటపుఆశల వూయాల తూగవుతుందో  సత్యజిత్ రే గారు అనగానే ప్రపంచంలో అత్యంత  ప్రతిభావంతులైన దర్శకులుగానే  కాక వారి తెలుపునలుపుల మ్యాజిక్ కళ్ల ముందుకొచ్చి ఆ నీడల్ని మనస్పర్శిస్తూ ఆ వెలుగునీడలల్లో ఆనందవిషాదాలన్ని వెతుక్కుoటూ...  'పథేర్ పాంచాలి' …

రెడ్ బ్యాంగిల్స్

మాయకోవస్కీ, ముప్పై ఆరేళ్ల వయస్సులో 13-4-1930 లో యీ లోకాన్ని వదిలి వెళ్లిపోయిన కవి. ... మౌనానికి మాటనీ నిద్రకి మెలకువనీ నిర్లిప్తతకి నిష్క్రమణనీ మరణానికి పునర్జీవనాన్నీ యిచ్చిన మహా కవి దట్టంగా అలుముకున్న నిశ్శబ్ధాన్ని వొకే వొక్క శబ్దంతో బద్దలు కొట్టడం యెలానో యీ మూగ ప్రపంచంకి నేర్పినవాడు! ... 13-4-2024

రెడ్ బ్యాంగిల్స్

ఆకుపచ్చని వెన్నెల .... వో నెలవంక సాయంకాలం కవికోకిల ప్రాంగణంలో ఆ పొడవాటి వరండాలో నలుపలకల స్తంభానికి వారి కుడి భుజాన్ని కాస్త ఆనించి ఆ వెన్నెలవంక వైపు కనురెప్పలు పైకెత్తి శివసాగర్ గారు చెప్పారు కదా... ఆకాశంలో నెలవంక నెలవంక నెలవంక ఆకాశం నెలవంక నెలవంక సొర చేప సొరచేప పసిపాప పులివిప్పి నెమలి కొండ పులివాగు రెల్లు దుబ్బు ... నా మల్లియ రాలెను నీ మొగిలి కూడా రాలేను నా మల్లియ, నీ …