వాన జల్లులు కాస్త మందంగా కురుస్తోన్న ఆ మధ్యాహానం సిటీ సెంట్రల్ మాల్ ముందున్న రైలింగ్ ని ఆనుకొని మిత్రుల కోసం యెదురు చూస్తున్నా... చిన్న మీటింగ్... యేం చర్చించాలాని ఆలోచిస్తున్నా... కానీ ఆలోచనలు తెగిపోతున్నాయి... మోటారు వాహనాలు రద్దీలో కిటకిటలాడే యీ నగరపు చౌరస్తాలో ప్రతి రోజు ట్రాఫిక్ లో యిరుక్కునే యీ అనుభవానికి యెటువంటి వాసన వుంది... డీసీల్, పెట్రోల్ పొగ కాలుష్యం... కాలుష్యపు వాసన చుట్టుముడుతోన్నప్పుడు కురుస్తున్న వాన పరిమళం కాలుష్యపు వాసనని …
సీక్రెట్ సూపర్ స్టార్
టీవీ మన లివింగ్ రూం సభ్యురాలై చాల యేళ్ళు గడిచిపోయాయి. నలుపు తెలుపు నుంచి రంగులతో వందల ఛానల్స్ తో చిన్నవి పెద్దవి బాగా పెద్దవి యిలా అనేక పరిమాణాల్లో యెప్పటికప్పుడు కొత్త టీవిసెట్స్ కోసం తప్పనిసరిగా మన బడ్జెట్ లో మనం కొంత కేటాయిస్తూనే వున్నాం. అందులో వచ్చేకొన్ని షోస్ మనలని పిల్లలని భలే ఆకట్టుకోవటం మనందరికి అనుభవమే. ‘కౌన్ బనేగా కరోడ్ పతీ’ మొదలైనప్పుడు అమితాబ్ గారి గంభీర్య మైన స్వరంకి అతని స్క్రీన్ …
నగరపు వనవాసులమై…
అప్పుడప్పుడు ఆ రోజులు బాగున్నాయి అనిపించే సందర్భాలు కొన్నింటాయి. చిన్నప్పటి నుంచి యెన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదువుతూ ఆ వనవాసిలో సత్యచరణ్ లా కొన్నాళ్ళు యే అరణ్యానికో వెళ్ళి అతను చెప్పిన అరణ్య ప్రకృతిదేవత తాలుక పలురూపాలు చూడాలనిపిస్తుంది. అలానే యుగళ ప్రసాద్ అడివి అంతటా యెన్నెన్నో రకాల కొత్తకొత్త విత్తనాలని తీసుకొచ్చి అడివిని పూలతోటగా పరిమళభరితం చెయ్యాలని ఆకాంక్షిస్తాడు. ఆ అరణ్యంలోని ధూసరవర్ణ శీర్షరేఖ, ధూదలి పుష్పాల పరిమళం, ధగద్దగాయమాన వెన్నెల రాత్రుల …
తొలి కార్తీక ప్రభాతం చెక్కు చెదరని మోహం
పిల్లలకు జేజేలు. పిల్లలకు కృతజ్ఞలు.
చిన్న చిన్న పిల్లలు ఆడుకోవాలి. పాడుకోవాలి. చిన్నచిన్న పనులు చేయాలి. సీతాకోక చిలుకల్ని రెక్కలతో పట్టుకొని దీక్షగా పరిశీలించాలి.పెద్దలు సమాధానం చెప్పలేని అనేక ప్రశ్నలు అనేకం వేయాలి. అన్నిటికి మించి వాళ్ళు అల్లరి చెయ్యాలి. అల్లరి అంటే హుకుంని ధిక్కరించడం, మంకు అంటే మనం జీర్ణం చేసుకున్న హేతువుని నిరాకరించడం. పిల్లలపై పెద్దల దాడిని కాస్త వాయిదా వేయమని అడుగుదాం. యెదగడానికి తొందర పడవద్దని, మరి కాసేపు పసితనపు అభయారణ్యంలో విహరించమని వారిని వొదిలేద్దాం. అందుకోసం యేo …
హృదయమొక రహస్య పాటల భోషాణం
వొకే పాట యే జ్ఞాపకాలను చిలకరిస్తుందో, యే అనుభవాలను గుమ్మరిస్తుందో ఆ అనుభవాలు యెవరికి వారికే సొంతం. పాటలు మన లోపలి పొరల్లో మౌనవ్రతం చేస్తుంటాయి. సాయంకాలపు సంపెంగ పరిమళంలా సమయం వచ్చినప్పుడు చకచకా మేం వున్నామని వచ్చేస్తాయి. పాట యెవరినైనా యిట్టే లాక్కుంటుంది. పెద్దగా శ్రమ పడకుండా, హోం వర్క్ చెయ్యకుండా కేవలం వినగలిగే నర్వ్ కాస్త యెలర్ట్ గా వుంటే చాలు పాట యెవరిలోకైనా దూరిపోయి దాక్కోగలదు. భాష అర్ధం కాక పోయినా, ఆ …
స్వప్న సాకారపు అడుగులు వేద్దాం సాహసీ…
వొకానొక కార్తీక ప్రభాతాన యేవో యేవో ఆలోచనలతో వూహలతో నడుస్తోంటే శీతాకాలపు లేత సూర్యరశ్మిలా నా అరిచేతుల్లోకి వచ్చేసినవారు దొస్తోయేవ్ స్కీ. దొస్తోయేవ్ స్కీ... మీకు తెలుసా... పేద ప్రజల అణిచివేత, నిజాయితీపరులైన పేదల జీవితాల్లోని విషాదం మీకు మీ వయస్సుకు మించిన చూపు కలిగినట్టే. పేదల ఆకలి, పేదరికం, వివక్ష, దోపిడీ అత్యంత పసివయస్సులోనే తన మనసుకి తాకిన సున్నిత మనస్కుడైన నా ప్రియ స్నేహితుడికి కలిగింది. నా స్నేహాన్ని చూసినప్పుడంతా మీరే గుర్తు వస్తారు. …
సీతాకోకచిలుకల సందోహం
యే ఆచ్ఛాదన లేకుండా వానలో తడిచినట్టు ప్రేమలో తడువు యుద్ధాలన్నీ రద్దై పోతాయి స్నేహ రుతువు విరబూస్తుంది సీతాకోకచిలుకల సందోహం ........... 21-10-2023
నవ్వూ వాన యెలా వున్నారు!
'అమ్మాయ్... నవ్వూ వాన యెలా వున్నారు!' అని భలే అడుగుతావు చిన్నిగా నవ్వుతావు. వాన దారుల్లోకి మరీ ముఖ్యంగా యిలాంటి ఆదుర్దా పూయించే వానదారుల్లోకి నడవాలనే సరదా యెవరికి వుంటుందబ్బాయి.!మంచు మొగ్గలు వేసే కాలంలో వాన ధారలుగా ధారలుగా.... అనుకోకుండా యీ దారుల్లో యిరుక్కున్నప్పుడు భలే అడుగుతున్నావు యెలా వున్నామోనని. దా... యీ గొడుగు లోపలికొస్తే- యిద్దరం తడుద్దాం... మరేమీ లేదు యీ గొడుగు మోసీ మోసీ చేతులు పీకుతున్నాయి. యీ గొడుగు బరువు నువ్వు మోస్తావని... …
హృదయమంతా నువ్వే…
-------------------------- హృదయమంతా నువ్వే... అస్సలు వో క్షణమైనా వదిలి దూరంగా వుండాలని వుండదు. వదిలి కాస్తైనా యెడం వుండలేనని కాబోలు యెక్కడ వున్నా లాక్కునే మోహా పరిమళం...నీకు చేరువగానే వుండాలని అందరికి వుంటుంది కదా... తెలుసు... వారు మన ఆంతరంగిక ఆత్మీయులు. నీపై యిష్టంతో నీ చుట్టూ యెన్నెన్ని హృదయాల్లో...వారందరినీ దగ్గరగా తీసుకొనే అమృత సుగంధం కదా నీ స్నేహం...యెనెన్ని మైత్రీ హృదయాలు నిన్ను సమీపిస్తే నాకంత ఆనందo. వుడుక్కుబోతనమేమి లేదు...కానీ నిన్ను పూర్తిగా లాక్కోవాలని నామీదకి …
