నీరవ నిశ్శబ్దంలో మనతో మనం చేసే మనో వైభవపు మైమరపు సంభాషణ  – 

ఘాంద్రుక్    నువ్వెక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నావని యిప్పుడెవరైనా నన్నడిగితే   ‘ఘాంద్రుక్’  అనేంతగా  అన్నపూర్ణా సర్క్యుట్ లో హైకింగ్ చేస్తోంది మనసు.  సతీశ్ చప్పరికె గారి ‘ఘాంద్రుక్ ’  వొకానొక రమ్య వైభవపు మైమరపు హృదయాన్ని  దేదీప్యమానంగా వెలిగిస్తుంది. వుజ్వలమైన జీవనానందం మొగలిపూల పరిమళమై మనసుపొరలన్ని గుప్పుమనిపిస్తుంది. యీ మాంత్రిక యాత్రానుభవం మంత్రనగరి సరిహద్దులల్ని స్కేటింగ్ చేయిస్తుంది. జీవిత సంక్షోభాల అగాధాల అంచున నిలబడినప్పుడో జీవితపు విజయ శిఖరాల మీద నిట్టనిలువుగా నిలబడి యెగరేసిన విజయకేతనాన్ని వీక్షిస్తూ చుట్టూ …

స్వప్న సాకారపు అడుగులు వేద్దాం సాహసీ…

వొకానొక కార్తీక ప్రభాతాన యేవో యేవో ఆలోచనలతో వూహలతో నడుస్తోంటే శీతాకాలపు లేత సూర్యరశ్మిలా నా అరిచేతుల్లోకి వచ్చేసినవారు దొస్తోయేవ్ స్కీ. దొస్తోయేవ్ స్కీ... మీకు తెలుసా... పేద ప్రజల అణిచివేత, నిజాయితీపరులైన పేదల జీవితాల్లోని విషాదం మీకు మీ వయస్సుకు మించిన చూపు కలిగినట్టే. పేదల ఆకలి, పేదరికం, వివక్ష, దోపిడీ అత్యంత పసివయస్సులోనే తన మనసుకి తాకిన సున్నిత మనస్కుడైన నా ప్రియ స్నేహితుడికి కలిగింది. నా స్నేహాన్ని చూసినప్పుడంతా మీరే గుర్తు వస్తారు. …