యే ఆచ్ఛాదన లేకుండా వానలో తడిచినట్టు ప్రేమలో తడువు యుద్ధాలన్నీ రద్దై పోతాయి స్నేహ రుతువు విరబూస్తుంది సీతాకోకచిలుకల సందోహం ........... 21-10-2023
నవ్వూ వాన యెలా వున్నారు!
'అమ్మాయ్... నవ్వూ వాన యెలా వున్నారు!' అని భలే అడుగుతావు చిన్నిగా నవ్వుతావు. వాన దారుల్లోకి మరీ ముఖ్యంగా యిలాంటి ఆదుర్దా పూయించే వానదారుల్లోకి నడవాలనే సరదా యెవరికి వుంటుందబ్బాయి.!మంచు మొగ్గలు వేసే కాలంలో వాన ధారలుగా ధారలుగా.... అనుకోకుండా యీ దారుల్లో యిరుక్కున్నప్పుడు భలే అడుగుతున్నావు యెలా వున్నామోనని. దా... యీ గొడుగు లోపలికొస్తే- యిద్దరం తడుద్దాం... మరేమీ లేదు యీ గొడుగు మోసీ మోసీ చేతులు పీకుతున్నాయి. యీ గొడుగు బరువు నువ్వు మోస్తావని... …
హృదయమంతా నువ్వే…
-------------------------- హృదయమంతా నువ్వే... అస్సలు వో క్షణమైనా వదిలి దూరంగా వుండాలని వుండదు. వదిలి కాస్తైనా యెడం వుండలేనని కాబోలు యెక్కడ వున్నా లాక్కునే మోహా పరిమళం...నీకు చేరువగానే వుండాలని అందరికి వుంటుంది కదా... తెలుసు... వారు మన ఆంతరంగిక ఆత్మీయులు. నీపై యిష్టంతో నీ చుట్టూ యెన్నెన్ని హృదయాల్లో...వారందరినీ దగ్గరగా తీసుకొనే అమృత సుగంధం కదా నీ స్నేహం...యెనెన్ని మైత్రీ హృదయాలు నిన్ను సమీపిస్తే నాకంత ఆనందo. వుడుక్కుబోతనమేమి లేదు...కానీ నిన్ను పూర్తిగా లాక్కోవాలని నామీదకి …
అన్వేషి…
మనకి మనమే ఆహ్వానించిన సుసంబరమైనా... తనకు తానుగా పలకరించిన మనోవుత్సాహమైనా హృదయాంతరాళాన ప్రేమోత్సపు వసంతాన్ని చిలకరించిన కోయిల చక్కని యెర్రని గొడుగేసుకొని సరికొత్త అన్వేషిగా మరో పూలకోనకి తరలిపోయిందనే కఠోర వాస్తవాన్ని మనసొప్పుకోడానికి యెన్ని వసంతాలు పడుతుందో... నిరంతరం నీలిమేఘాన్నికురిపించే చల్లని గాలిగానే ప్రేమ నిరంతరం వొకే హృదయం మీదే వీస్తూప్రేమని కురుస్తున్నందన్న నమ్మికని వదిలించుకునే మంత్రమేదైనా వుందా! మనకి మనమే ఆహ్వానించిన సుసంబరమైనా... తనకు తానుగా పలకరించిన మనోవుత్సాహమైనా... కొన్నాళ్ళు ఆ మనోవుత్సాహపు పూదోట వూయలూగిన …
వొక పూలతోట
యెందుకనే ప్రశ్న లేనే లేదు నువ్వంటే ప్రేమ... నీ చుట్టూ వొక పూలతోటని పెంచుకున్నాను... అంతే Kuppili Padma 18 -06 - 2023
అడివంచు రైల్వే స్టేషన్
అబ్బాయీ... యెలా వున్నావు? యేo చేస్తున్నావు? యేమైనా తిన్నావా? యెప్పటిలాగే రొటీన్ పలకరింపులే! నువ్వు యెలా వుంటావో, యేo చేస్తున్నావో, యేమి తింటావో ప్రతిదీ గుండెకు తెలుస్తూనే వుంటుంది.దస్తోవిస్కీ క్రైం అండ్ పనిష్మెంట్ లో చివరి ఘట్టం నీకు గుర్తుండే వుంటుంది కదా. అపారమైన చదువురివి. నిన్నుయిలా ప్రశ్నించడం యెందుకు? ప్రవాస శిక్షలో వున్న రాస్కోల్నికోవ్ కోసం యెంతో శ్రమపడి అన్ని వదులుకొని సైబీరియాకు వస్తుంది సోఫియా. అబ్బాయీ... యెలా వున్నావు? యేo చేస్తున్నావు? యేమైనా తిన్నావా? …
అరణ్యపువెన్నెలానదీరాగం… ఇళయరాజా గారు…
ఇళయరాజా గారిని తలచుకోవడమంటే...ఆషాడమాసంలో తొలి వాన కురిసినప్పుడు భూమిలోంచి వెచ్చగా జనించే భూసుగంధాన్ని గుండెల నిండుగా ఆఘ్రాణించే అగరుపొగ లేతసవ్వడిని వినటం కదా...!
మై డియర్ మోహవెన్నెలా…
లోలోపలి నుంచి వొక రుతువు విరగబూసి మనసు యెప్పుడూ అంతగా కిలకిలా నవ్వి వుండదు. బయటి ప్రపంచపు సౌoదర్యానికి మన కిటికీలు బార్లా తెరిచి పెట్టే వైశాఖపు గాలి కదా ప్రేమ.!
Password is incorrect Access denied
యెన్ని పాటల్ని అల్లిన వొక ప్రేమ కానప్పుడు యిక నాతోనే నేను లేచిపోతాను ...
My first post
Mayura is my personal blog. I will be posting random thoughts as occasional posts here.
