వాన జల్లులు కాస్త మందంగా కురుస్తోన్న ఆ మధ్యాహానం సిటీ సెంట్రల్ మాల్ ముందున్న రైలింగ్ ని ఆనుకొని మిత్రుల కోసం యెదురు చూస్తున్నా... చిన్న మీటింగ్... యేం చర్చించాలాని ఆలోచిస్తున్నా... కానీ ఆలోచనలు తెగిపోతున్నాయి... మోటారు వాహనాలు రద్దీలో కిటకిటలాడే యీ నగరపు చౌరస్తాలో ప్రతి రోజు ట్రాఫిక్ లో యిరుక్కునే యీ అనుభవానికి యెటువంటి వాసన వుంది... డీసీల్, పెట్రోల్ పొగ కాలుష్యం... కాలుష్యపు వాసన చుట్టుముడుతోన్నప్పుడు కురుస్తున్న వాన పరిమళం కాలుష్యపు వాసనని …
