————————–

హృదయమంతా నువ్వే…
అస్సలు వో క్షణమైనా వదిలి దూరంగా వుండాలని వుండదు. వదిలి కాస్తైనా యెడం వుండలేనని కాబోలు యెక్కడ వున్నా లాక్కునే మోహా పరిమళం…నీకు చేరువగానే వుండాలని అందరికి వుంటుంది కదా… తెలుసు… వారు మన ఆంతరంగిక ఆత్మీయులు.
నీపై యిష్టంతో నీ చుట్టూ యెన్నెన్ని హృదయాల్లో…వారందరినీ దగ్గరగా తీసుకొనే అమృత సుగంధం కదా నీ స్నేహం…యెనెన్ని మైత్రీ హృదయాలు నిన్ను సమీపిస్తే నాకంత ఆనందo.
వుడుక్కుబోతనమేమి లేదు…కానీ నిన్ను పూర్తిగా లాక్కోవాలని నామీదకి పెత్తనపు బెత్తంతో వస్తారు చూడు…అప్పుడు చెపుతా వారికి నిక్కచ్చిగాఆ సౌరభం అచ్చంగా…మన యిరు హృదయాల ప్రేమతో జీవనాన్ని అల్లుకొంటూ పూసిన మనోప్రాణపుష్పoదని.
