నవ్వూ వాన యెలా వున్నారు!


‘అమ్మాయ్… నవ్వూ వాన యెలా వున్నారు!’ అని భలే అడుగుతావు చిన్నిగా నవ్వుతావు.

వాన దారుల్లోకి మరీ ముఖ్యంగా యిలాంటి ఆదుర్దా పూయించే వానదారుల్లోకి నడవాలనే సరదా యెవరికి వుంటుందబ్బాయి.!
మంచు మొగ్గలు వేసే కాలంలో వాన ధారలుగా ధారలుగా…. అనుకోకుండా యీ దారుల్లో యిరుక్కున్నప్పుడు భలే అడుగుతున్నావు యెలా వున్నామోనని. దా… యీ గొడుగు లోపలికొస్తే- యిద్దరం తడుద్దాం… మరేమీ లేదు యీ గొడుగు మోసీ మోసీ చేతులు పీకుతున్నాయి. యీ గొడుగు బరువు నువ్వు మోస్తావని… ☺️

వానకి మత్తుసుగంధాలని వూరిస్తోన్న పున్నాగ సరోవరాలని హత్తుకొని మాటిమాటికీ నన్ను నేనే మర్చిపోతున్నాను. నన్ను నాకు కానుకగా యిచ్చేద్దువు.

వ్యాఖ్యానించండి