సీతాకోకచిలుకల సందోహం

యే ఆచ్ఛాదన లేకుండా వానలో తడిచినట్టు ప్రేమలో తడువు యుద్ధాలన్నీ రద్దై పోతాయి స్నేహ రుతువు విరబూస్తుంది సీతాకోకచిలుకల సందోహం ........... 21-10-2023

నవ్వూ వాన యెలా వున్నారు!

'అమ్మాయ్... నవ్వూ వాన యెలా వున్నారు!' అని భలే అడుగుతావు చిన్నిగా నవ్వుతావు. వాన దారుల్లోకి మరీ ముఖ్యంగా యిలాంటి ఆదుర్దా పూయించే వానదారుల్లోకి నడవాలనే సరదా యెవరికి వుంటుందబ్బాయి.!మంచు మొగ్గలు వేసే కాలంలో వాన ధారలుగా ధారలుగా.... అనుకోకుండా యీ దారుల్లో యిరుక్కున్నప్పుడు భలే అడుగుతున్నావు యెలా వున్నామోనని. దా... యీ గొడుగు లోపలికొస్తే- యిద్దరం తడుద్దాం... మరేమీ లేదు యీ గొడుగు మోసీ మోసీ చేతులు పీకుతున్నాయి. యీ గొడుగు బరువు నువ్వు మోస్తావని...  …

హృదయమంతా నువ్వే…

-------------------------- హృదయమంతా నువ్వే... అస్సలు వో క్షణమైనా వదిలి దూరంగా వుండాలని వుండదు. వదిలి కాస్తైనా యెడం వుండలేనని కాబోలు యెక్కడ వున్నా లాక్కునే మోహా పరిమళం...నీకు చేరువగానే వుండాలని అందరికి వుంటుంది కదా... తెలుసు... వారు మన ఆంతరంగిక ఆత్మీయులు. నీపై యిష్టంతో నీ చుట్టూ యెన్నెన్ని హృదయాల్లో...వారందరినీ దగ్గరగా తీసుకొనే అమృత సుగంధం కదా నీ స్నేహం...యెనెన్ని మైత్రీ హృదయాలు నిన్ను సమీపిస్తే నాకంత ఆనందo. వుడుక్కుబోతనమేమి లేదు...కానీ నిన్ను పూర్తిగా లాక్కోవాలని నామీదకి …