అన్వేషి…

మనకి మనమే ఆహ్వానించిన సుసంబరమైనా... తనకు తానుగా పలకరించిన మనోవుత్సాహమైనా హృదయాంతరాళాన ప్రేమోత్సపు వసంతాన్ని చిలకరించిన కోయిల చక్కని యెర్రని గొడుగేసుకొని సరికొత్త అన్వేషిగా మరో పూలకోనకి తరలిపోయిందనే కఠోర వాస్తవాన్ని మనసొప్పుకోడానికి యెన్ని వసంతాలు పడుతుందో... నిరంతరం నీలిమేఘాన్నికురిపించే చల్లని గాలిగానే ప్రేమ నిరంతరం వొకే హృదయం మీదే వీస్తూప్రేమని కురుస్తున్నందన్న నమ్మికని వదిలించుకునే మంత్రమేదైనా వుందా! మనకి మనమే ఆహ్వానించిన సుసంబరమైనా... తనకు తానుగా పలకరించిన మనోవుత్సాహమైనా... కొన్నాళ్ళు ఆ మనోవుత్సాహపు పూదోట వూయలూగిన …

అడివంచు రైల్వే  స్టేషన్ 

అబ్బాయీ... యెలా వున్నావు? యేo చేస్తున్నావు? యేమైనా తిన్నావా? యెప్పటిలాగే రొటీన్ పలకరింపులే! నువ్వు యెలా వుంటావో, యేo చేస్తున్నావో, యేమి తింటావో ప్రతిదీ గుండెకు తెలుస్తూనే వుంటుంది.దస్తోవిస్కీ క్రైం అండ్ పనిష్మెంట్ లో చివరి ఘట్టం నీకు గుర్తుండే వుంటుంది కదా. అపారమైన చదువురివి. నిన్నుయిలా ప్రశ్నించడం యెందుకు? ప్రవాస శిక్షలో వున్న రాస్కోల్నికోవ్ కోసం యెంతో శ్రమపడి అన్ని వదులుకొని సైబీరియాకు వస్తుంది సోఫియా.         అబ్బాయీ... యెలా వున్నావు? యేo చేస్తున్నావు? యేమైనా తిన్నావా? …

అరణ్యపువెన్నెలానదీరాగం… ఇళయరాజా గారు…

ఇళయరాజా గారిని తలచుకోవడమంటే...ఆషాడమాసంలో తొలి వాన కురిసినప్పుడు భూమిలోంచి వెచ్చగా జనించే భూసుగంధాన్ని గుండెల నిండుగా ఆఘ్రాణించే అగరుపొగ లేతసవ్వడిని వినటం కదా...!

మై డియర్  మోహవెన్నెలా…

లోలోపలి నుంచి వొక రుతువు విరగబూసి మనసు యెప్పుడూ అంతగా కిలకిలా నవ్వి వుండదు. బయటి ప్రపంచపు సౌoదర్యానికి మన కిటికీలు బార్లా తెరిచి పెట్టే వైశాఖపు గాలి కదా ప్రేమ.!