అబ్బాయీ... యెలా వున్నావు? యేo చేస్తున్నావు? యేమైనా తిన్నావా? యెప్పటిలాగే రొటీన్ పలకరింపులే! నువ్వు యెలా వుంటావో, యేo చేస్తున్నావో, యేమి తింటావో ప్రతిదీ గుండెకు తెలుస్తూనే వుంటుంది.దస్తోవిస్కీ క్రైం అండ్ పనిష్మెంట్ లో చివరి ఘట్టం నీకు గుర్తుండే వుంటుంది కదా. అపారమైన చదువురివి. నిన్నుయిలా ప్రశ్నించడం యెందుకు? ప్రవాస శిక్షలో వున్న రాస్కోల్నికోవ్ కోసం యెంతో శ్రమపడి అన్ని వదులుకొని సైబీరియాకు వస్తుంది సోఫియా. అబ్బాయీ... యెలా వున్నావు? యేo చేస్తున్నావు? యేమైనా తిన్నావా? …
మై డియర్ మోహవెన్నెలా…
లోలోపలి నుంచి వొక రుతువు విరగబూసి మనసు యెప్పుడూ అంతగా కిలకిలా నవ్వి వుండదు. బయటి ప్రపంచపు సౌoదర్యానికి మన కిటికీలు బార్లా తెరిచి పెట్టే వైశాఖపు గాలి కదా ప్రేమ.!
