చిన్న చిన్న పిల్లలు ఆడుకోవాలి. పాడుకోవాలి. చిన్నచిన్న పనులు చేయాలి. సీతాకోక చిలుకల్ని రెక్కలతో పట్టుకొని దీక్షగా పరిశీలించాలి.పెద్దలు సమాధానం చెప్పలేని అనేక ప్రశ్నలు అనేకం వేయాలి. అన్నిటికి మించి వాళ్ళు అల్లరి చెయ్యాలి. అల్లరి అంటే హుకుంని ధిక్కరించడం, మంకు అంటే మనం జీర్ణం చేసుకున్న హేతువుని నిరాకరించడం. పిల్లలపై పెద్దల దాడిని కాస్త వాయిదా వేయమని అడుగుదాం. యెదగడానికి తొందర పడవద్దని, మరి కాసేపు పసితనపు అభయారణ్యంలో విహరించమని వారిని వొదిలేద్దాం. అందుకోసం యేo …
