రాత్రి కురిసిన నగరపు వాన…

కిటికీ అద్దాల మీద రిఫ్లెక్ట్ అవుతున్న నీరెండ. కారిడార్ ల్లో వో మూలకి పెట్టిన మనీప్లాంట్ తీగ పక్కకి వొరిగి అప్పుడప్పుడూ బయట గాలికి వూగుతుంది. రాత్రి వానకి తడిసిపోయిన కాంక్రీట్ గోడలు. చెమ్మకి పెచ్చులూడిపోయిన పిస్తాగ్రీన్ గోడలు. లిఫ్ట్ నిండా, మెట్లంతా చేరిన రాత్రి వాన తాలూక నీరు యింకా అప్పుడప్పుడూ కిందకి జారుతోంది. అపార్ట్ మెంట్ ఆఫీషియల్ వాట్స్అప్ గ్రూప్ లో మేస్సేజస్ వస్తున్నాయి ఆ యా ఫ్లాట్స్ వాళ్ళ నుంచి. వై ఫై …

వెచ్చనిపొగ పరిమళాల జల్లులలో

వాన జల్లులు కాస్త మందంగా కురుస్తోన్న ఆ మధ్యాహానం సిటీ సెంట్రల్ మాల్ ముందున్న రైలింగ్ ని ఆనుకొని మిత్రుల కోసం యెదురు చూస్తున్నా... చిన్న మీటింగ్... యేం చర్చించాలాని ఆలోచిస్తున్నా... కానీ ఆలోచనలు తెగిపోతున్నాయి... మోటారు వాహనాలు రద్దీలో కిటకిటలాడే యీ నగరపు చౌరస్తాలో ప్రతి రోజు ట్రాఫిక్ లో యిరుక్కునే యీ అనుభవానికి యెటువంటి వాసన వుంది... డీసీల్, పెట్రోల్ పొగ కాలుష్యం... కాలుష్యపు వాసన  చుట్టుముడుతోన్నప్పుడు కురుస్తున్న వాన పరిమళం కాలుష్యపు వాసనని …

సీక్రెట్ సూపర్ స్టార్

టీవీ మన లివింగ్ రూం సభ్యురాలై చాల యేళ్ళు గడిచిపోయాయి. నలుపు తెలుపు నుంచి రంగులతో వందల ఛానల్స్ తో చిన్నవి పెద్దవి బాగా పెద్దవి యిలా అనేక పరిమాణాల్లో యెప్పటికప్పుడు కొత్త టీవిసెట్స్ కోసం తప్పనిసరిగా మన బడ్జెట్ లో మనం కొంత కేటాయిస్తూనే వున్నాం. అందులో వచ్చేకొన్ని షోస్ మనలని పిల్లలని భలే ఆకట్టుకోవటం మనందరికి అనుభవమే. ‘కౌన్ బనేగా కరోడ్ పతీ’  మొదలైనప్పుడు అమితాబ్ గారి గంభీర్య మైన  స్వరంకి అతని స్క్రీన్ …

నగరపు వనవాసులమై…

అప్పుడప్పుడు ఆ రోజులు బాగున్నాయి అనిపించే సందర్భాలు కొన్నింటాయి.  చిన్నప్పటి నుంచి యెన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ  చదువుతూ ఆ వనవాసిలో సత్యచరణ్ లా కొన్నాళ్ళు యే అరణ్యానికో వెళ్ళి  అతను చెప్పిన అరణ్య ప్రకృతిదేవత తాలుక పలురూపాలు చూడాలనిపిస్తుంది. అలానే యుగళ ప్రసాద్ అడివి అంతటా యెన్నెన్నో రకాల కొత్తకొత్త విత్తనాలని తీసుకొచ్చి అడివిని పూలతోటగా పరిమళభరితం చెయ్యాలని ఆకాంక్షిస్తాడు. ఆ అరణ్యంలోని ధూసరవర్ణ శీర్షరేఖ, ధూదలి పుష్పాల పరిమళం, ధగద్దగాయమాన వెన్నెల రాత్రుల …

హృదయమొక రహస్య పాటల భోషాణం

వొకే పాట యే జ్ఞాపకాలను చిలకరిస్తుందో, యే అనుభవాలను గుమ్మరిస్తుందో ఆ అనుభవాలు యెవరికి వారికే సొంతం. పాటలు మన లోపలి పొరల్లో మౌనవ్రతం చేస్తుంటాయి. సాయంకాలపు సంపెంగ పరిమళంలా సమయం వచ్చినప్పుడు చకచకా మేం వున్నామని వచ్చేస్తాయి. పాట యెవరినైనా యిట్టే లాక్కుంటుంది. పెద్దగా శ్రమ పడకుండా, హోం వర్క్ చెయ్యకుండా కేవలం వినగలిగే నర్వ్ కాస్త యెలర్ట్ గా వుంటే చాలు పాట యెవరిలోకైనా దూరిపోయి దాక్కోగలదు. భాష అర్ధం కాక పోయినా, ఆ …