నైరుతి ఆగమ వేళ నిలువెత్తు పొదలా సరుగుడు చెట్ల గాలులు తీరం వైపుకు తోస్తున్నప్పుడు యెదురుగా నీలివెన్నెలాకాశంలా సాగరం దివారాత్రులు యెగిసి పడే కెరటాలు అలలై వుత్త హోరుని వినిపిస్తూ తీరభూమికి యేమి చెప్పాలనుకుంటున్నాయి! అసలైన మాట ముత్యమై యే చేతి వేలిని ప్రపోజ్ చెయ్యాలనుకుంటుందోనన్న వైనాన్ని అత్యంత రహస్యంగా తన లోలోపల దాచుకున్నది యెందుకో! ఆ లోతుని చేధించే మంత్రాన్ని యే యేడేడు సంద్రాల అవతల యే చెట్టు తొర్రలో దాచి పెట్టిందో యీ అగాధనీలిమ …
లోవెలుగు…
లోవెలుగు చినుకుల్లో మొలకల పరిమళపు వెలుతురు చిట్టిపొట్టి జల్లులలో తడిచిన మనసుల సౌరభం వొక్క చినుకు చాలు వొంటిపై యింద్రధనస్సు విరబూయటానికి…!
సీతాకోకచిలుకల సందోహం
యే ఆచ్ఛాదన లేకుండా వానలో తడిచినట్టు ప్రేమలో తడువు యుద్ధాలన్నీ రద్దై పోతాయి స్నేహ రుతువు విరబూస్తుంది సీతాకోకచిలుకల సందోహం ........... 21-10-2023
వొక పూలతోట
యెందుకనే ప్రశ్న లేనే లేదు నువ్వంటే ప్రేమ... నీ చుట్టూ వొక పూలతోటని పెంచుకున్నాను... అంతే Kuppili Padma 18 -06 - 2023
Password is incorrect Access denied
యెన్ని పాటల్ని అల్లిన వొక ప్రేమ కానప్పుడు యిక నాతోనే నేను లేచిపోతాను ...
