రెడ్ బ్యాంగిల్స్

శ్రావ్య సుప్రభాతం. నిన్నా మొన్నా అటు మొన్నా యిలా రోజులు గడిచిపోతుంటాయి యెప్పటిలానే మనిద్దరం వొకరి కళ్ళల్లోకి వొకరు చూసుకోకుండా... కలిసి కూర్చుని Marquez నో..  బిభూధినో మళ్ళీ మళ్ళీ పలవరిస్తుంటాం చూడు... అలా కలబోతల పలవరింత లేకుండానే వుదయాలు గడుస్తున్నాయి. వుదయమే రంగురంగుల కవిత్వపుపూలతోటల నుంచి నువ్వు  యెంచిన  వొక కవితని... నే నిద్రలోంచి కనురెప్పలు విప్పేసరికి నా కళ్ళ ముందు వుంచుతావు చూడు...  ప్రభాతాన్నే వో రమ్య భావనని చూడటం  మృదువుగా మన దినచర్య …

వుదయమంతా యెండలో కాగీ కాగీ యెంత పరిమళభరితంగా వికసిస్తాయో మల్లెపువ్వులు. కొత్తగా మళ్ళీమళ్ళీ రాబోతోన్న వర్షరుతువు కోసమే యీ గాలులు యింత వేడిని వీస్తున్నాయేమో. యింతగా వుక్కపోత లేకపోతే ఆ తొలకరి భూసుగంధం, ఆ చల్లని వేపకొమ్మల తీయ్యని గాలులు, కొత్త రంగులాకాశపు మాధుర్యాన్ని మనం ఆస్వాదించమేమోననే యింత వేడనుకొంటాను.  కుప్పిలి పద్మ.                                              

వెచ్చనిపొగ పరిమళాల జల్లులలో

వాన జల్లులు కాస్త మందంగా కురుస్తోన్న ఆ మధ్యాహానం సిటీ సెంట్రల్ మాల్ ముందున్న రైలింగ్ ని ఆనుకొని మిత్రుల కోసం యెదురు చూస్తున్నా... చిన్న మీటింగ్... యేం చర్చించాలాని ఆలోచిస్తున్నా... కానీ ఆలోచనలు తెగిపోతున్నాయి... మోటారు వాహనాలు రద్దీలో కిటకిటలాడే యీ నగరపు చౌరస్తాలో ప్రతి రోజు ట్రాఫిక్ లో యిరుక్కునే యీ అనుభవానికి యెటువంటి వాసన వుంది... డీసీల్, పెట్రోల్ పొగ కాలుష్యం... కాలుష్యపు వాసన  చుట్టుముడుతోన్నప్పుడు కురుస్తున్న వాన పరిమళం కాలుష్యపు వాసనని …

అరణ్యపువెన్నెలానదీరాగం… ఇళయరాజా గారు…

ఇళయరాజా గారిని తలచుకోవడమంటే...ఆషాడమాసంలో తొలి వాన కురిసినప్పుడు భూమిలోంచి వెచ్చగా జనించే భూసుగంధాన్ని గుండెల నిండుగా ఆఘ్రాణించే అగరుపొగ లేతసవ్వడిని వినటం కదా...!

Hello world!

Welcome to WordPress.com! This is your very first post. Click the Edit link to modify or delete it, or start a new post. If you like, use this post to tell readers why you started this blog and what you plan to do with it. Happy blogging!