రాత్రి కురిసిన నగరపు వాన…

కిటికీ అద్దాల మీద రిఫ్లెక్ట్ అవుతున్న నీరెండ. కారిడార్ ల్లో వో మూలకి పెట్టిన మనీప్లాంట్ తీగ పక్కకి వొరిగి అప్పుడప్పుడూ బయట గాలికి వూగుతుంది. రాత్రి వానకి తడిసిపోయిన కాంక్రీట్ గోడలు. చెమ్మకి పెచ్చులూడిపోయిన పిస్తాగ్రీన్ గోడలు. లిఫ్ట్ నిండా, మెట్లంతా చేరిన రాత్రి వాన తాలూక నీరు యింకా అప్పుడప్పుడూ కిందకి జారుతోంది. అపార్ట్ మెంట్ ఆఫీషియల్ వాట్స్అప్ గ్రూప్ లో మేస్సేజస్ వస్తున్నాయి ఆ యా ఫ్లాట్స్ వాళ్ళ నుంచి. వై ఫై …