నైరుతి ఆగమ వేళ

నైరుతి ఆగమ వేళ

నిలువెత్తు పొదలా సరుగుడు చెట్ల గాలులు

తీరం వైపుకు తోస్తున్నప్పుడు యెదురుగా

నీలివెన్నెలాకాశంలా  సాగరం

దివారాత్రులు యెగిసి పడే కెరటాలు అలలై 

వుత్త హోరుని వినిపిస్తూ

తీరభూమికి యేమి చెప్పాలనుకుంటున్నాయి!

అసలైన మాట ముత్యమై యే చేతి వేలిని 

ప్రపోజ్ చెయ్యాలనుకుంటుందోనన్న వైనాన్ని

అత్యంత రహస్యంగా తన లోలోపల దాచుకున్నది యెందుకో!

ఆ లోతుని చేధించే మంత్రాన్ని 

యే యేడేడు సంద్రాల అవతల  

యే చెట్టు తొర్రలో దాచి పెట్టిందో యీ అగాధనీలిమ

కురిసిన నైరుతి ప్రభాత హృదయంలో

నువ్వొక ప్రాచీన మంత్రనగరివి.

వ్యాఖ్యానించండి