శ్రావ్య సుప్రభాతం. నిన్నా మొన్నా అటు మొన్నా యిలా రోజులు గడిచిపోతుంటాయి యెప్పటిలానే మనిద్దరం వొకరి కళ్ళల్లోకి వొకరు చూసుకోకుండా... కలిసి కూర్చుని Marquez నో.. బిభూధినో మళ్ళీ మళ్ళీ పలవరిస్తుంటాం చూడు... అలా కలబోతల పలవరింత లేకుండానే వుదయాలు గడుస్తున్నాయి. వుదయమే రంగురంగుల కవిత్వపుపూలతోటల నుంచి నువ్వు యెంచిన వొక కవితని... నే నిద్రలోంచి కనురెప్పలు విప్పేసరికి నా కళ్ళ ముందు వుంచుతావు చూడు... ప్రభాతాన్నే వో రమ్య భావనని చూడటం మృదువుగా మన దినచర్య …
