రెడ్ బ్యాంగిల్స్

నూట మూడు వసంతాల వెలుగునీడలు:

…..

మే 2 వ తేదీన జన్మించిన మృదువైన మాంత్రిక హృదయం సత్యజిత్ రే గారికి వినమ్ర నమస్సులు.

మొగలిపూరేకుల నడుమ సహజసిద్ధమైన పరిమళం దాక్కుని మనం పలకరించగానే  విరజిమ్మే సుగంధాన్ని స్పర్శించాలని మనసేలా ఆరాటపుఆశల వూయాల తూగవుతుందో  సత్యజిత్ రే గారు అనగానే ప్రపంచంలో అత్యంత  ప్రతిభావంతులైన దర్శకులుగానే  కాక వారి తెలుపునలుపుల మ్యాజిక్ కళ్ల ముందుకొచ్చి ఆ నీడల్ని మనస్పర్శిస్తూ ఆ వెలుగునీడలల్లో ఆనందవిషాదాలన్ని వెతుక్కుoటూ… 

‘పథేర్ పాంచాలి’ నవల చదివినప్పుడు చిన్నారి దుర్గని యెంతో ప్రేమించాను… పాటని మొదట్లోనే ఆపేసి వెళ్లిపోయినప్పుడు యెంత దుఖః… దుర్గ గుండెల్లో గుచ్చుకొన్న దుఖఃపుముల్లు శ్వాసంత శాశ్వతం.

విభూతి భూషణ్ బంధోపాధ్యాయ అక్షర దృశ్య కావ్యాన్ని కదిలే చిత్రపు సునేత్రం సత్యజిత్ రే గారు…

విభూతి గారేంత భావుకులో సత్యజిత్ రే అంతే భావకులవ్వటం వల్లే  ‘పథేర్ పాంచాలి’  ‘బాట పాడే పాట’ వంగదేశంలోని నిశ్చిoదిపురం… దుర్గా… అప్పు… సున్నితమైన వాత్సల్యo… ప్రేమ అంతా పేదరికపు సెగకు ఆహుతైపోవటం…

హృదయాన్ని ఫటేల్మని విరిచేసిన దృశ్యకావ్యం…

సత్యజిత్ రే గారు అప్పు ట్రాయాలజీని  చూసినప్పుడు కూడా దుర్గానే సన్నని నొప్పిలా కదులుతూ యెనెన్ని కరువుల నడుమైనా… బీభత్సాల మధ్యనైనా… ప్రతిఘటనలైనా… జీవనం కోసమే వోడిపోని పోరాటం… అవును యీ సన్నని బాట పాడే పాట… మనకేం చెపుతోంది…  మానవసం భంధాలని నిజాయితీగా ప్రేమిస్తూ వాటిని  తలతాకట్టు పెట్టయినా మనుష్యులు బతికించుకోవాలి…  దుర్గని యెంతో ప్రేమించినా ఆ బాలిక ప్రాణాన్ని వెళ్ళనివ్వకుండా ఆపలేకపోయినట్టు యే దారి పాటా మధ్యలో ముగిసిపోకూడదు… పాట చిరంజీవి…

మే 2న జన్మించిన సత్యజిత్ రే గారు తన కెమెరా తో  మనకా బాటపాడే వెలుగునీడల్ని కెమెరాతో అందించిన ఆ మృదువైన మాంత్రిక హృదయానికి వినమ్ర నమస్సులు.

వ్యాఖ్యానించండి