రెడ్ బ్యాంగిల్స్

—-

వో అబ్బాయి…

వుదయం వుదయమే వో సందేహం తళుక్కుమంది. మనం భలే దగ్గర కదా… మరి యీ సంగతి తెలియకుండా వుందే… మామూలు విషయమా… మనకెంతో స్పూర్తిదాయకం… మనకెంతో ప్రియమైనది. మనం మన గోదావరిప్రవాహపు నేల మీద వారిని చూసినప్పుడే అడగాలనుకున్నాను… యిన్నేళ్ళకి అడుగుతున్నాను…

విషయం యేమిటంటే…

చిన్నప్పుడు… అంటే బాగా చిన్నప్పుడు…

– మెరుపు మెరిస్తే,

వాన కురిస్తే,

ఆకసమున హరివిల్లు విరిస్తే

అవి మీకే అని ఆనందించే

కూనల్లారా: –

అని వినిపిస్తే అవి మన కోసమే ఆ కూన నేనే నేనే గుసగుసగ్గా మనకి మనమే చెప్పుకొన్న ఆ శైశవ గీతి మన కోసమే అనుకొనే గరికపచ్చ మైదానాల్లో వుడతల్లా చెంగు చెంగున దూకే కాలంలో నీకు

శ్రీశ్రీ గారు యెదురయ్యారా…

లేదా

ఆ గుబురుల ఆకుపచ్చని గౌతమీ ప్రాంగణంలోనో… గోదావరి తీరమ్మీదో… యవ్వన కాలపు కలలతో నడుస్తుంటే కవితా ! ఓ కవితా ! అని మీ కనురెప్పలకి పలవరింత పుప్పుడిలా అద్దుకొంతుంటే మైమరచిపోయి వారు నిన్ను వో ట్రాన్స్ లోకి నడిపించారా… !

లేదా

– జనం మనుష్యలమై బతకాలి అని మనసులో వేగుచుక్క విరిసిన వో కాంతివంతమైన వేళ

ఊగరా, ఊగరా, ఊగరా!

ఉరికొయ్య అందుకొని ఊగరా!

ఉరికొయ్య అంటుకొని ఊగరా!

ఉయ్యాలలాగ బాగా ఊగరా!

సోదరా, సోదరా, సోదరా!

చావన్నది నీకు లేనే లేదురా!

వీరుడా! ధీరుడా! శూరుడా!

***

ఎండనక, వాననక – తిండి సరిగ్గా తినక,

ఉన్నచోటఉండకుండ ఊళ్లెన్నో చుట్టేవు!

-పగబట్టిన, పడగెత్తిన పాములాగా బుసకొట్టి

ప్రజావంచకాధములకు సమాధులే కట్టేవు

అని యెలుగెత్తిపాడుకొనే రోజుల్లో అపాట పదేపదే పాడుతూ నాగస్వరం విన్న నిలువెత్తు మణివై తల అటూ యిటూ వూపుతూ వూగిపోయే రోజుల్లోనా..! యేమో… మై డియర్… నువ్వే చెప్పాలి… తన కవిత్వంతో తిరుగులేని మేలిమి లోకాన్ని మనకిచ్చిన శ్రీ శ్రీ గారి కవిత్వంతో గడిపే రోజు కదా…

మనకి శ్రీశ్రీ గారి కవిత్వం అంటే మనల్ని మనం మర్చి పోయి వూగుతుంటే మనకేదో పిచ్చి పట్టిందా… గాలి సోకిందా అని చుట్టూ వున్న వాళ్ళు అనుకునేంత వూపు కదా… మరి మనకి శ్రీశ్రీ గారి కవిత్వం యెప్పుడు గుండె చప్పుడు అయిందో మనమెప్పుడూ చెప్పుకోలేదు. యెoదుకంటే ఆ కవి కవిత్వ సమక్షంలో కవిత్వం తప్పా మిగిలిన మాటలన్నింటిని రద్దు చేసేస్తారు. మనం చాల పంచుకున్నాం అనుకుంటాం కానీ పoచుకొన్న వాటి కంటే పంచుకోవలసినవే యెక్కువ వున్నాయి. నిన్ను శ్రీశ్రీ గారు యెప్పుడు కమ్ముకున్నారో మనం యెప్పుడూ కలబోసుకోనే లేదు కదా… మనం యీ సారి తప్పకుండా చెప్పుకోవాలి… సరేనా… అప్పటి వరకూ నువ్వు ప్రేమించే వో కవితని నీకోసం తిరిగి యిక్కడ రాస్తుంటే నీ స్వరంలో ఆ కవిత వినిపిస్తూనే వుంది.. నాకే కాదు స్నేహితులందరికి…

కవితా ! ఓ కవితా !

నా యువకాశల నవపేశల సుమ గీతావరణలో

నిను నే నొక సుముహుర్తంలో

అతిసుందర సుస్యoదనమందున

దూరంగా వినువీధుల్లో విహరించే

అందని అందానివిగా

భావించిన రోజులలో,

నీకై బ్రతుకే ఒక తపమై

వెదుకాడే నిమిషాలందు నిషాలందున,

ఎటు నే చూసిన చటులాలంకారపు

మటుమాయల నటనలలో

నీ రూపం కనరానందున,

నాగుహలో, కుటిలో, చీకటిలో

ఒక్కడినై స్రుక్కిన రోజులు లేవా?

***

కవితా: ఓ కవితా:

నేడో, నా ఊహాoచల

సాహసికాంసం కప్పిన నా

నిటూర్పులు వినిపిస్తాయా?

నేనేదో విరచిస్తానని,

నా రచనలతో లోకం ప్రతిఫలించి,

నా తపస్సు ఫలించి,

నా గీతం గుండెలలో ఘార్ణిల్లగ

నా జాతి జనులు పాడుకొనే

మంత్రంగా మ్రోగించాలని,

నా ఆకాశాలను లోకానికి చేరువుగా,

నా ఆదర్శాలను

సోదరులంతా పంచుకొనే

వెలుగుల రవ్వల జడిగా,

అందీ అందకపోయే

నీ చేలాంచలముల విసరుల

కొన గాలులతో నిర్మించిన

నా నుడి నీ గుడిగా,

నా గీతం నైవేద్యంగా, హృద్యంగా,

అర్పిస్తావో

నా విసరిన రస విశృమర

ఓసుమ పరాగం

కుహో: ఓ రసధుని: మణిఖని : జననీ : ఓ కవితా :

కవిత: ఓ కవితా : ఓ కవితా :

—–

శ్రీశ్రీ.

వ్యాఖ్యానించండి