
మాయకోవస్కీ, ముప్పై ఆరేళ్ల వయస్సులో 13-4-1930 లో యీ లోకాన్ని వదిలి వెళ్లిపోయిన కవి.
…
మౌనానికి మాటనీ
నిద్రకి మెలకువనీ
నిర్లిప్తతకి నిష్క్రమణనీ
యిచ్చిన మహా కవి
దట్టంగా అలుముకున్న
నిశ్శబ్ధాన్ని
వొకే వొక్క శబ్దంతో
బద్దలు కొట్టడం యెలానో
యీ మూగ ప్రపంచంకి నేర్పినవాడు!
…
13-4-2024
