రెడ్ బ్యాంగిల్స్

చైత్ర మాసపు వేకువ మసక వెలుగుల్ని చీల్చుకుంటూ వినిపించే కోయిల తొలిపాటని విన్నప్పుడు…

అకస్మాత్తుగా దేహం నుంచి రంగురంగుల పల్చని సీతాకోకచిలుక రెక్కలు విప్పారతాయి.

గుండె తలుపులు తట్టి సుదూర వనాల వసంత పరిమళమేదో లోలోపలకి చొచ్చుకొచ్చి వెన్నెల్ని వర్షిస్తోంది.

తనువంతా తొలితామరలు విచ్చుకున్న తటాకమై పోతోoది.

వోయ్… వనవాసీ!

ఆ పాట నువ్వు పoపొందేనని

ఆ గొంతులోని తడిజీర చెబుతోంది..

19 చైత్రం 2021

వ్యాఖ్యానించండి