మాయకోవస్కీ, ముప్పై ఆరేళ్ల వయస్సులో 13-4-1930 లో యీ లోకాన్ని వదిలి వెళ్లిపోయిన కవి. ... మౌనానికి మాటనీ నిద్రకి మెలకువనీ నిర్లిప్తతకి నిష్క్రమణనీ మరణానికి పునర్జీవనాన్నీ యిచ్చిన మహా కవి దట్టంగా అలుముకున్న నిశ్శబ్ధాన్ని వొకే వొక్క శబ్దంతో బద్దలు కొట్టడం యెలానో యీ మూగ ప్రపంచంకి నేర్పినవాడు! ... 13-4-2024
రెడ్ బ్యాంగిల్స్
ఆకుపచ్చని వెన్నెల .... వో నెలవంక సాయంకాలం కవికోకిల ప్రాంగణంలో ఆ పొడవాటి వరండాలో నలుపలకల స్తంభానికి వారి కుడి భుజాన్ని కాస్త ఆనించి ఆ వెన్నెలవంక వైపు కనురెప్పలు పైకెత్తి శివసాగర్ గారు చెప్పారు కదా... ఆకాశంలో నెలవంక నెలవంక నెలవంక ఆకాశం నెలవంక నెలవంక సొర చేప సొరచేప పసిపాప పులివిప్పి నెమలి కొండ పులివాగు రెల్లు దుబ్బు ... నా మల్లియ రాలెను నీ మొగిలి కూడా రాలేను నా మల్లియ, నీ …
రెడ్ బ్యాంగిల్స్
చైత్ర మాసపు వేకువ మసక వెలుగుల్ని చీల్చుకుంటూ వినిపించే కోయిల తొలిపాటని విన్నప్పుడు... అకస్మాత్తుగా దేహం నుంచి రంగురంగుల పల్చని సీతాకోకచిలుక రెక్కలు విప్పారతాయి. గుండె తలుపులు తట్టి సుదూర వనాల వసంత పరిమళమేదో లోలోపలకి చొచ్చుకొచ్చి వెన్నెల్ని వర్షిస్తోంది. తనువంతా తొలితామరలు విచ్చుకున్న తటాకమై పోతోoది. వోయ్... వనవాసీ! ఆ పాట నువ్వు పoపొందేనని ఆ గొంతులోని తడిజీర చెబుతోంది.. ... 19 చైత్రం 2021
రెడ్ బ్యాంగిల్స్ ---- వో అబ్బాయి... వుదయం వుదయమే వో సందేహం తళుక్కుమంది. మనం భలే దగ్గర కదా... మరి యీ సంగతి తెలియకుండా వుందే... మామూలు విషయమా... మనకెంతో స్పూర్తిదాయకం... మనకెంతో ప్రియమైనది. మనం మన గోదావరిప్రవాహపు నేల మీద వారిని చూసినప్పుడే అడగాలనుకున్నాను... యిన్నేళ్ళకి అడుగుతున్నాను... విషయం యేమిటంటే... చిన్నప్పుడు... అంటే బాగా చిన్నప్పుడు... - మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా: - …
