వుదయమంతా యెండలో కాగీ కాగీ యెంత పరిమళభరితంగా వికసిస్తాయో మల్లెపువ్వులు. కొత్తగా మళ్ళీమళ్ళీ రాబోతోన్న వర్షరుతువు కోసమే యీ గాలులు యింత వేడిని వీస్తున్నాయేమో. యింతగా వుక్కపోత లేకపోతే ఆ తొలకరి భూసుగంధం, ఆ చల్లని వేపకొమ్మల తీయ్యని గాలులు, కొత్త రంగులాకాశపు మాధుర్యాన్ని మనం ఆస్వాదించమేమోననే యింత వేడనుకొంటాను.
కుప్పిలి పద్మ.

