అన్వేషి…

మనకి మనమే ఆహ్వానించిన సుసంబరమైనా… తనకు తానుగా పలకరించిన మనోవుత్సాహమైనా

హృదయాంతరాళాన ప్రేమోత్సపు వసంతాన్ని చిలకరించిన కోయిల చక్కని యెర్రని గొడుగేసుకొని సరికొత్త అన్వేషిగా మరో పూలకోనకి తరలిపోయిందనే కఠోర వాస్తవాన్ని మనసొప్పుకోడానికి యెన్ని వసంతాలు పడుతుందో…

నిరంతరం నీలిమేఘాన్నికురిపించే చల్లని గాలిగానే ప్రేమ నిరంతరం వొకే హృదయం మీదే వీస్తూప్రేమని కురుస్తున్నందన్న నమ్మికని వదిలించుకునే మంత్రమేదైనా వుందా! మనకి మనమే ఆహ్వానించిన సుసంబరమైనా… తనకు తానుగా పలకరించిన మనోవుత్సాహమైనా…

కొన్నాళ్ళు ఆ మనోవుత్సాహపు పూదోట వూయలూగిన సౌరభపు తెమ్మర మనల్ని జ్ఞాపకంగా పలకరించ్చినప్పుడు

చెమ్మగిల్లిన మనసు కళ్ళచెమ్మవుతోన్న ప్రతిసారీ ఆనందాన్ని అన్ని వేళలా పంచుకోలేనట్టే… దిగుల్ని అన్ని వేళలా పంచుకోలేం… ప్రేమాగమనాన్ని అందరితో పంచుకోలేనట్టే… మనల్ని వద్దనుకున్న వైనాన్ని చెప్పలేం…  యిలా మనకి మనమే యేవో సర్ది చెప్పుకొంటూ… మెల్లగా మెలమెల్లగా మనల్ని మనమే తరచి చూసుకోవాలి యెప్పుడో వొకప్పుడు యింతకీ యీ వేదనలోకెందుకు నెట్టివేయబడ్డామని!

కొన్నాళ్ళా…!

మనోకోత

యేమో!

తెలీదెంత కాలమో…!

వ్యాఖ్యానించండి