అన్వేషి…

మనకి మనమే ఆహ్వానించిన సుసంబరమైనా... తనకు తానుగా పలకరించిన మనోవుత్సాహమైనా హృదయాంతరాళాన ప్రేమోత్సపు వసంతాన్ని చిలకరించిన కోయిల చక్కని యెర్రని గొడుగేసుకొని సరికొత్త అన్వేషిగా మరో పూలకోనకి తరలిపోయిందనే కఠోర వాస్తవాన్ని మనసొప్పుకోడానికి యెన్ని వసంతాలు పడుతుందో... నిరంతరం నీలిమేఘాన్నికురిపించే చల్లని గాలిగానే ప్రేమ నిరంతరం వొకే హృదయం మీదే వీస్తూప్రేమని కురుస్తున్నందన్న నమ్మికని వదిలించుకునే మంత్రమేదైనా వుందా! మనకి మనమే ఆహ్వానించిన సుసంబరమైనా... తనకు తానుగా పలకరించిన మనోవుత్సాహమైనా... కొన్నాళ్ళు ఆ మనోవుత్సాహపు పూదోట వూయలూగిన …