మై డియర్  మోహవెన్నెలా…

లోలోపలి నుంచి వొక రుతువు విరగబూసి మనసు యెప్పుడూ అంతగా కిలకిలా నవ్వి వుండదు. బయటి ప్రపంచపు సౌoదర్యానికి మన కిటికీలు బార్లా తెరిచి పెట్టే  వైశాఖపు గాలి కదా ప్రేమ.!కళ్ళకి అడ్డుపడే ముంగురులను సవరించే చిరుగాలి ప్రేమ. వో మనసు మీద యిష్టం అంటే మన మీద మనకు పెరిగిపోయే యిష్టమే… 

వో మై డియర్  మోహవెన్నెలా…

యీ సారి విరబూసిన వైశాఖ పున్నమి యింతకు ముందెప్పుడూ యింతలా గిలిగింత పెట్టలేదు. యెందుకో తెలుసా  మన స్నేహితులమనే యెరుకొచ్చాక యిదే మొదటి వైశాఖ పౌర్ణమి కదా… భలే వుందిలే. 

పలచటి నీరెండ పొరల మీద నుంచి మెరిసి పడే వెన్నెల యెప్పుడూ యింత చల్లగా వున్నట్టూ లేదు. యీ లోకం యెప్పుడూ యింత అందంగానూ తోచలేదు.

లోలోపలి నుంచి వొక రుతువు విరగబూసి మనసు యెప్పుడూ అంతగా కిలకిలా నవ్వి వుండదు. బయటి ప్రపంచపు సౌoదర్యానికి మన కిటికీలు బార్లా తెరిచి పెట్టే  వైశాఖపు గాలి కదా ప్రేమ.!

కళ్ళకి అడ్డుపడే ముంగురులను సవరించే చిరుగాలి ప్రేమ. వో మనసు మీద యిష్టం అంటే మన మీద మనకు పెరిగిపోయే యిష్టమే… 

వొక అద్భుతాన్ని ఆసాంతం చూడటానికి విచ్చుకుని విస్తరించే కనుపాపలాగా, కనుగొన్న సాహచర్యం తో కలిసి ప్రయాణించడానికి మనసు కూడా అన్ని హద్దులూ దాటి పుష్పిస్తుంది. 

యీ జాబిల్లినే చూస్తు నువ్వు నన్నే తలుచుకొంటూ నీ పక్కనే నేనున్నానుకొంటూ కవిత్వం చెపుతూ మధ్య మధ్యలో నా బుగ్గపై చిటికేస్తూ కళ్లల్లోకి కళ్ళు పెట్టి నవ్వుతావు చూడూ ఆ వెలుగులో యీ వెన్నెలలే వెలతెలపోతుంటాయి.

వో అబ్బాయి… వచ్చే పున్నమికి మనిద్దరం వొకే చోట వుండాలి. యిద్దరం కలిసి మనకిష్టమైన గోదావరి వొడ్డున కూర్చుని యీ వెన్నెలని చూడాలి  వొకరి చేతుల్లో వొకరి చేతులని పెనవేసుకొని… తెలిసిందా వో నా మోహవెన్నెల…. నీ నుదిటిపై వో వెన్నెల పుప్పొడి…

వ్యాఖ్యానించండి