
Password is incorrect
Access denied
యెన్ని సాయంత్రాలని పొదిగినా
వొక రాత్రి కానప్పుడు
నీ సాయం కోసం లేచొచ్చాను
ప్రపంచానికి తెరలు దించి
మనమిద్దరమే మిగిలే
యేకాంత రంగస్థలాన్ని సృష్టించాను
వేసవి తోలి జాము తెమ్మెరా
తొలకరి యింద్రధనవూ
హేమంతపు పులకరింతా …
సమయం లేదని
రుతువులన్ని వొకేసారి ముంచుకొచ్చాయి
సమక్షాని సంధించి కాంక్ష
కనుసైగ చేసింది
మనం కోసుకోలేమని కాబోలు
పున్నాగ అదేపనిగా పూలవాన కురిపిస్తోంది
యెన్ని పాటల్ని అల్లిన
వొక ప్రేమ కానప్పుడు
యిక నాతోనే నేను లేచిపోతాను …
